అందుబాటులో ఉండని వెటర్నరీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి : పల్సి గ్రామం రైతులు

 అందుబాటులో ఉండని వెటర్నరీ డాక్టర్ పై చర్యలు తీసుకోవాలి :  పల్సి గ్రామం రైతులు
  • హాస్పిటల్ ముందు రైతుల నిరసన

కుభీర్, వెలుగు: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పల్సి గ్రామంలోని పశువైద్యశాలలో వెటర్నరీ డాక్టర్ అందుబాటులో ఉండడం లేదని గ్రామానికి చెందిన కొందరు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం హాస్పిటల్ ముందు నిరసన తెలిపారు. పశువులకు రోగాలు వచ్చి హాస్పిటల్​కు తీసుకెళ్తే డాక్టర్ అందుబాటులో ఉండడం లేదని వాపోయారు. 

వారానికి ఒకటి రెండు రోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారని ఆరోపించారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.