
ఈ ఏడాది ఒక పంట కోల్పోయినా పర్వాలేదు.. కానీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు రైతు సంఘం నేత రాకేష్ తికాయత్. తాము చేపట్టిన ఈ ఉద్యమం బలహీనపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనొక పోతే తాము చేయగలిగిందేమీ లేదని స్పష్టం చేశారు. తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు. గడచిన 70 ఏళ్ళ నుంచి పంటలు పండిస్తూ ఎంతో నష్టపోయాం…ఒక పంటను త్యాగం చేయడానికి తాము సిద్ధమని ఆయన ప్రకటించారు. ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్‌లో కచ్చితంగా ఏప్రిల్-మే మధ్యకాలంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి తీరుతామన్నారు తేల్చి చెప్పారు తికాయత్.