పదేళ్లలో ఎంతమంది కాశ్మీరీ పండిట్లను వెనక్కి తీసుకొచ్చారు?

పదేళ్లలో ఎంతమంది కాశ్మీరీ పండిట్లను వెనక్కి తీసుకొచ్చారు?
  • మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా

న్యూఢిల్లీ: భారత దేశంలో భాగమైనందుకు జమ్మూకాశ్మీర్ ప్రజలు కూడా గర్విస్తున్నారని నేషనల్​ కాన్ఫరెన్స్ పార్టీ ఎంపీ, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా లోక్​సభలో పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ.. భారతదేశం హిందువులది మాత్రమే కాదని, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులతో పాటు దేశంలో నివసిస్తున్న వారందరిదీ అని అన్నారు. 

ప్రధాని కేవలం ఒక్క రంగుకే ప్రతినిధి కాదు.. దేశం మొత్తానికీ ప్రతినిధి. 140 కోట్ల మంది భారతీయులకు ప్రతినిధిననే విషయం మోదీ మరవొద్దని పేర్కొన్నారు.