మినీస్కర్ట్ రూపకర్త మేరీ క్వాంట్ కన్నుమూత

మినీస్కర్ట్ రూపకర్త మేరీ క్వాంట్ కన్నుమూత

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ , మినీస్కర్ట్ రూపకర్త మేరీ క్వాంట్ (93) కన్నుమూశారు. ఏప్రిల్ 13న దక్షిణ  యూకేలోని సర్రేలో తన నివాసంలో  ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.

1950 లో ఆమె తన భర్తతో కలిసి లండన్ లో బజార్ అనే బొటిక్ ప్రారంభించారు. 1960 లో క్వాంట్ రూపొందించిన మినీ స్కర్ట్ ఫ్యాషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు  తెచ్చింది. బ్రిటన్ లో ఆమె స్వింగింగ్ సిక్ట్సీస్ గా ప్రసిద్ధి చెందారు. క్వాంట్ 1966లో లండన్ సన్నివేశానికి మోకాలి నుండి 8 అంగుళాల వరకు హెమ్‌ లైన్‌లతో కూడిన మినీ స్కర్ట్‌లను పరిచయం చేసింది.  అవి మహిళలను బాగా ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి మార్కెట్లో వీటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచి ఆమె చాలా పాపులర్ అయ్యారు.