నేను కోరుకున్న జీవితం ఇది కాదు

నేను కోరుకున్న జీవితం ఇది కాదు

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో.. ప్రముఖ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకుంది. తను నివసించే ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది ప్రత్యూష.  ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నటులకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ప్రత్యూష. మొదట  అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె ఇంట్లో సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ‘ ఇది నేను కోరుకున్న జీవితం కాదు.. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నాను. ప్రతిరోజూ నేను ఏడుస్తూ ఉంటాను. నా తల్లిదండ్రులు, నా స్నేహితులు, శ్రేయోభిలాషులందరు క్షమించండి..! అని  ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.