60 యేళ్లు దాటినోళ్లతో ఫ్యాషన్​ షో!

60 యేళ్లు దాటినోళ్లతో ఫ్యాషన్​ షో!

అదొక ఫ్యాషన్​ షో. ఆరు పదులు దాటిన మహిళలు ర్యాంప్​ మీద స్టయిల్​గా నడుస్తున్నారు. వీళ్లని చూస్తే ఫ్యాషన్​కి వయసుతో సంబంధం లేదు అనిపించడం ఖాయం. దేనిమీదైనా ప్యాషన్ ఉంటే చాలు వయసుతో సంబంధం లేకుండా అదరగొట్టొచ్చని నిరూపిస్తున్నారు. జీవితాన్ని  కొత్తగా మొదలుబెట్టాలనే మెసేజ్​ ఇస్తోన్న వీళ్ల ఫ్యాషన్​కి ఓ లెక్క ఉంది.  

అమెరికాలోని డాలస్​లో జరిగిన ఫ్యాషన్​ పోటీల్లో అరవై నుంచి డెబ్భై అయిదేళ్ల వయసు వాళ్లకి మాత్రమే ఎంట్రీ. బాటన్​ విన్యాసాలు (బెల్లీ డ్యాన్స్​, ఒంటి చేత్తో పుషప్స్​ తీయడం వంటివన్నీ ఈ పోటీల్లో చేస్తారు. అయితే, మిగతా అందాల పోటీల్లోలాగ వీళ్లకి బాత్​ సూట్​ కాంపిటీషన్ ఉండదు. ఈ పోటీల్లో అరవై మూడేళ్ల కింబెర్లీ ఘెడీ విజేతగా నిలిచింది. పియానో టీచర్​ అయిన కింబెర్లీకి ఇది నిజంగా కొత్త జీవితం. 

అందమంటే...
అరవై ఏళ్లకి దగ్గర పడుతున్న కొద్దీ కింబెర్లీకి ‘నా  జీవితం ముగిసిపోయింది. ఇక చావు కోసం ఎదురుచూడడమే మిగిలింది’ అనే ఆలోచనలు ఉండేవి. కానీ, అరవైల్లోకి వచ్చాక కొత్తగా బతకాలి అనుకుంది. ఫిట్​నెస్​ కోసం వర్కవుట్స్​ చేయడం మొదలుపెట్టింది. పెళ్లి కూడా చేసుకుంది. అంతేకాకుండా ఫ్యాషన్​ పోటీలపై ఫోకస్​ పెట్టింది. ‘మిస్​ టెక్సాస్​ సీనియర్ అమెరికా బ్యూటీ పేజెంట్’ విజేతగా నిలిచింది కూడా. బ్యూటీ పేజెంట్​ కిరీటం సొంతం చేసుకున్న క్షణం ఎమోషనల్​ అయిపోయింది. ‘అరవై ఏళ్లు దాటిన మహిళలు తమకేది ఇష్టమో అది కొనసాగించేలా సాయం చేయాలి అనుకుంటున్నా’ అని కన్నీళ్లని తుడుచుకుంటూ చెప్పింది. అంతేకాకుండా  వయ సు మీద పడిన తరువాతి జీవితం గురించి కూడా చాలా చెప్పింది. “వయసు పైబడిందని అందరూ  మమ్మల్ని తక్కువగా  చూసేవాళ్లు. అది చాలా  పెద్ద పొరపొటు. అరవై ఏళ్లు దాటిన తర్వాతే నా శరీరం మీద దృష్టి పెట్టాను. ఇప్పుడు ఫిట్​గా ఉన్నాను. ముడతల చర్మంలోనూ అందం ఉంటుంది. మలి వయసులో ఉన్న మహిళలు కూడా చాలా చేయగలరనేది నా ఫీలింగ్​” అంటున్న కింబెర్లి తన వయసు వాళ్లకి ఒక ఇన్​స్ఫిరేషన్​​. 

ఏ వయసులోనైనా సరే
‘‘నా గురించి నేను చాలా గొప్పగా ఫీల్​ అవుతున్నా. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నలభై, యాభై, అరవై, డెబ్భై, ఎనభై ఏళ్లు వచ్చినా కూడా లైఫ్​ని ఎంజాయ్​ చేయొచ్చు. ‘మానసిక పరిస్థితి, ఏం చేయాలి అనుకుంటున్నాం’ అనే వాటి మీదే మన హ్యాపీనెస్​ ఉంటుంది. అరవై ఏళ్లలో నాకు నచ్చినట్టు ఉండటం చాలా బాగుంది”అని చెప్పింది ఈ ఫ్యాషన్​ షోలో పాల్గొన్న  జాయస్​ బ్రౌన్​.