FASTag ఏడాది పాస్‌కి భారీగా పెరిగిన డిమాండ్.. వసూళ్లు ఎంతంటే..?

FASTag ఏడాది పాస్‌కి భారీగా పెరిగిన డిమాండ్.. వసూళ్లు ఎంతంటే..?

FASTag Annual Pass: కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా ఫాస్ట్‪ట్యాగ్ ఏడాది పాస్ రిలీజ్ చేసింది. దీంతో నేషనల్ హైవేలు అలాగే నేషనల్ ఎక్స్ ప్రెస్ వేలపై కార్ల ఓనర్లు టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి చెల్లింపులు చేయకుండానే ఏడాదికి 200 ట్రిప్స్ వరకు ప్రయాణించేందుకు వీలు కల్పించబడింది. అయితే దీనిని ఆగస్టు 15 స్వతంత్ర్య దినోత్సవం నుంచి దేశవ్యాప్తంగా పాస్ అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 1150 టోల్ ప్లాజాలు అనుసంధానించబడ్డాయి. 

కేంద్ర రవాణా శాఖ ప్రకటించిన వార్షిక ఫాస్ట్ ట్యాగ్ పాస్ వాహనదారుల నుంచి భారీగా స్పందనను చూసింది. కేవలం ఆగస్టు 15 ఒక్కరోజే లక్ష 40వేల మంది వాహన యజమానులు పాస్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల లోపే ఈ కొనుగోళ్లు జరిగినట్లు ఎన్ హెచ్ ఏఐ చెప్పింది. టోల్ ప్లాజాల వద్ద పాస్ కలిగిన వాహనదారులు పాస్ కాగానే వారికి జీరో టోల్ చెల్లింపుకు సంబంధించిన కన్ఫర్మేషన్ మెసేజ్ పంపుతోంది నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా. దీంతో వాహనదారుల ప్రయాణం సుగమం అయ్యింది. రోజురోజుకూ పాస్ కొంటున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో భారీగానే వసూళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

కేవలం రూ.3వేలకే ఏడాదికి 200 ట్రిప్స్ వరకు జాతీయ రహదారులపై తిరిగేందుకు వీలు కల్పిస్తూ పాస్ తీసుకురావటంపై వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. అయితే స్టేట్ హైవేలపై ప్రయాణానికి ఈ పాస్ ఉపయోగపడకపోవటం చాలా మందిని నిరుత్సాహపరుస్తోంది. అయితే ఏడాది పాస్ కొనేందుకు ఆసక్తి ఉన్న వారు రాజమార్గ్ యాప్ లేదా నేషనల్ హైవే అధారిటీ అధికారిక వెబ్ ద్వారా తమ కారు వివరాలు, ఫాస్టాగ్ ఐడీతో దీనిని యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదంటే ప్రస్తుతం ఉన్న విధానం కిందనే ప్రతి టోల్ ప్లాజా వద్ద చెల్లింపులు వారి వాలెట్ ఖాతా నుంచి కట్ అవుతాయి.