
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని 44 వ జాతీయ రహదారిపై టిప్పర్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఘటన సమయంలో బైక్పై ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు మొత్తం నలుగురు వెళ్తున్నారు. ఇందులో ఇద్దరు పెద్దలు, బాబు ఘటన స్థలంలోనే మరణించగా.. పాపకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
►ALSO READ | శ్రీశైలం పాతాళగంగ దగ్గర చిరుత మృతి