
కూకట్పల్లి, వెలుగు: ఫతేనగర్ఫ్లైఓవర్ బ్రిడ్జి పెచ్చులూడి పడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. ఫతేనగర్ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్బ్రిడ్జి మెట్ల మార్గం వద్ద సోమవారం సాయంత్రం పెచ్చులూడి కిందపడ్డాయి.
ఆ సమయంలో మెట్ల మార్గం కింద ఉన్న ఛత్తీస్గడ్కు చెందిన ఒక యువకుడి కాలికి తీవ్ర గాయాలు, మరొకరికి స్పల్ప గాయాలయ్యాయి. దీంతో వారిని స్థానికులు సమీప హాస్పిటల్కు తరలించారు.