
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను కారు ఢీ కొట్టడంతో ఇద్దరు తండ్రీ కొడుకు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని వెంటనే ఉస్మానియకు తరలించారు. తిరుపతి వెళ్లి తిరుగు వస్తున్న సమయంలో తిమ్మాపూర్ వద్ద ట్యాంకర్ యూ టర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చి కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కొత్తూరు పోలీసులు. మృతులిద్దరు హైదరాబాద్ లోని సైదాబాద్ కు చెందిన తండ్రి కొడుకులు కే.కల్యాణ చక్రవర్తి, కే.సత్యనారాయణగా గుర్తించారు. మరో ఇద్దరు హంసప్రియ, శారదా పరిస్థితి విషమంగా ఉంది. మరో వ్యక్తి రఘునందన్ కు గాయాలు అయ్యాయి.