వైరల్ గా మారిన సెల్ఫీ.. స్పెషాలిటీ ఏముందంటే?

 వైరల్ గా మారిన సెల్ఫీ..  స్పెషాలిటీ  ఏముందంటే?

పైన కనిపిస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు సెల్ఫీ తీస్తుండగా మరొకరు అ ఫోటో వంక చూస్తున్నారు. అయితే ఇందులో పెద్ద వింతేమీ ఉందని అనుకోవచ్చు. ఈ ఫోటోకి  ఓ స్పెషాలిటీ  ఉందండి. ఫోటోలో కనిపిస్తున్న వీరిద్దరూ తండ్రీకొడుకులు. తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తుండగా, కొడుకు ట్రావెల్ టిక్కెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే వారు పనిచేస్తున్న రైళ్లు పక్కపక్కన వెళ్తుండగా ఈ సెల్ఫీమూమెంట్‌ను  తీసుకున్నారు. సెల్ఫీలో ఇద్దరూ యూనిఫాం ధరించి ఉన్నారు.  ఇది ఎక్కడ అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో వీపరితంగా వైరల్ అవుతోంది. అద్భుతమైన సెల్ఫీ, తండ్రీ కొడుకుల ప్రేమ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ పోస్ట్‌కి 28,000 కంటే ఎక్కువ లైక్‌లు  1,700కి పైగా రీ-ట్వీట్లు వచ్చాయి.