
హైదరాబాద్ నాగోల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్ కుంట్లూర్ దగ్గర బైక్ ను టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో కూత్బుల్లాపూర్కు చెందిన తండ్రి, కొడుకులు చనిపోయారు. తండ్రి కుమార్ స్పాట్ లో చనిపోగా .. బైక్ నుంచి మంటలు చెలరేగి కొడుకు ప్రదీప్ సజీవదహనం అయ్యాడు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతులు కుబ్దుల్లాపూర్ కు చెందిన తండ్రి కొడుకులు కుమార్(40),ప్రదీప్(13) గా గుర్తించారు. రోడ్డు ప్రమాదంతో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.