
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. భార్య ప్రవర్తనతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణం చిత్తూరు జిల్లాలోని ఓ లాడ్జిలో శుక్రవారం మధ్యాహ్నం బయటపడింది. తన భార్య పలువురితో అక్రమ సంబంధం పెట్టుకుందని గణేష్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. ఓ లాడ్జిలో నాలుగున్నరేళ్ల కుమార్తెకు ఉరేసి చంపి ఆపై తానూ ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.