
బెంగళూరు: కొడుకు మందుల కోసం సైకిల్‌పై 300 కిలోమీటర్లు ప్రయాణించాడో వ్యక్తి. కర్నాటకలోని గణిగణకొప్పాల్‌కు చెందిన ఆనంద్ షెట్టి అనే సదరు వ్యక్తి ఆ గ్రామం నుంచి 150 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. లాక్‌డౌన్ కారణంగా వాహనాలు నడవకపోవడంతో.. సైకిల్ పైనే వెళ్లొచ్చాడు. మే 23న ఇంటి నుంచి బయలుదేరి ఆనంద్.. 26న మందులతో తిరిగొచ్చాడు. పదేళ్ల వయస్సున్న అతడి కుమారుడు నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ప్రతి నెలా రెండుసార్లు హాస్పిటల్‌కు వెళ్లి మందులు తెచ్చుకుంటారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో సైకిల్ మీదే వెళ్లి మందులు తీసుకొచ్చాడు.