చెన్నై నుంచి వచ్చిన కొడుకుతో తండ్రికి కరోనా పాజిటివ్

చెన్నై నుంచి వచ్చిన కొడుకుతో తండ్రికి కరోనా పాజిటివ్
  • రాజోలికి చెందిన వ్యక్తికి పాజిటివ్‌
  •  ఇటీవలే చెన్నైన నుంచి వచ్చిన ఇతని కొడుకు
  •  ఆఫీసర్లు అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇంటింటి సర్వే

జోగులాంబ గద్వాల జిల్లాకు మూడు లింకుల ద్వారా కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. మార్కజ్‌, కర్నూల్ డాకర్, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌ నేత అంత్యక్రియలు ద్వారా వైరస్‌ వ్యాపించగా.. తాజాగా మరో లింక్‌ బయటపడింది. రాజోలికి చెందిన ఓ వ్యక్తికి కర్నూల్ ఆస్పత్రిలో పాజిటివ్ వచ్చింది. ఇతని కొడుకు చెన్నై నుంచి ఇటీవలే వచ్చినట్లు గ్రామస్తులు చెప్పారు.

కొడుకు నుంచి!

బాధితుడి కొడుకు చెన్నైలో లేబర్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. లాక్ డౌన్‌తో ఉపాధి కోల్పోవడంతో గత నెల 26న స్వగ్రామానికి వచ్చాడు. గ్రామస్తుల సమాచారం మేరకు స్థానిక వైద్య సిబ్బంది అతన్ని పరిశీలించారు. జలుబు, జ్వరం ఉండడంతో మందులు ఇచ్చి అబ్జర్వేషన్లో పెట్టారు. రెండు మూడు రోజుల్లో తగ్గిపోవడం తో లైట్ తీసుకున్నారు. కానీ, 30న ఇతని తండ్రికి తీవ్ర జ్వరం వచ్చింది. వెంటనే స్థానిక ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంపీ డాక్టర్ వద్ద చూపించుకున్నాడు. ‌‌‌‌ అయినా తగ్గ కపోవడంతో సర్కారు దవాఖానకు వెళ్లగా టైఫాయిడ్‌ అని చెప్పారు. మందులు వాడుతున్నా తగ్గకపోవడంతో ఈనెల10న కర్నూల్ ఆసుపత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో డాకర్లు16న శాంపిల్స్‌ తీసి పంపించారు. 19న రిపోర్ట్ రాగా పాజి‌టివ్‌‌‌‌‌‌‌‌ అని తేలింది.

8 మంది క్వారంటైన్

అప్రమత్తమైన వైద్య సిబ్బంది, ఆఫీసర్లు చెన్నై నుంచి వచ్చిన వ్యక్తి, అతని తండ్రి ఎక్కడ తిరిగారు.. ఎవరికి కలిశారు… అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఆదివారం రాత్రి ఎనిమిది మందిని క్వారెంటైన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఉన్నాడు. సోమవారం గ్రామంలో ఇంటింటి సర్వేను నిర్వహించారు. ప్రైమరీ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌ ఉన్న మరి కొంతమందిని క్వారెం టైన్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరింత అలర్ట్ ‌‌‌‌‌‌‌గా ఉండండి

పోలీసులు మరింత అలర్ట్ ట్‌‌‌‌‌‌‌‌ ఉండాలని నిజామాబాద్ రేంజ్ ఐజీ శివశంకర్ రెడ్డి సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కంటైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలైన పాత హౌసింగ్ బోర్డ్ కాలనీ, రాధాకృ ష్ణ కాలనీలో పర్యటించారు. అక్కడి మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న సౌలత్లపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వ రావు జిల్లాలో పాజిటివ్ కేసుల వివరాలు, కంటైన్‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌ ‌‌‌‌‌‌ఏరియాలో తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అనంతరం శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. కంటైన్‌ మెంట్‌ ‌‌‌‌‌‌‌ఏరియాలో బందోబస్తు బాగా చేస్తున్నారని, ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదనపు ఎస్పీ కృష్ణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ హనుమంతు ఉన్నారు. బయటికి వస్తే కేసులే కంటైన్‌మెంట్‌‌‌‌‌‌‌‌ జోన్లనుంచి బయటకు వస్తే కేసులు పెడతామని ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు హెచ్చరించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని మోహిన్ మైల, వేద నగర్, హౌసింగ్ బోర్ట్ కాలనీ, భీమ్ నగర్, గంజి పేటలో పర్యటించారు. అనవసరంగా బయటికి వచ్చిన ఐదుగురుపై ఆదివారం కేసు నమోదు చేశామన్నారు.