వడ్ల కొనుగోలు కేంద్రాల్లో శిక్షణ పొందిన వారే ఉండాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వడ్ల  కొనుగోలు కేంద్రాల్లో  శిక్షణ పొందిన వారే ఉండాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇచ్చిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన వారు మాత్రమే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్​ ఆదర్శ్​ సురభి ఆదేశించారు. మంగళవారం కొత్తకోట మండలం పాలెం, కానాయిపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులు వడ్లు తెచ్చిన వెంటనే సీరియల్  నంబర్​ వారీగా వివరాలు నమోదు చేయాలని , నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే మిల్లుకు వడ్లు లోడ్  చేసి పంపించాలని ఆదేశించారు. 

నిర్వాహకులకు సన్న, దొడ్డు రకం వడ్లను గుర్తించడంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పాలెం గ్రామ రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం వీడియో ప్రత్యక్ష ప్రసారాన్ని రైతులతో కలిసి వీక్షించారు. ఆయన వెంట డీసీవో రాణి, డీసీఎస్ వో కాశీ విశ్వనాథ్, డీఎం జగన్, తహసీల్దార్  వెంకటేశ్వర్లు, ఎంపీడీవో వినీత్  ఉన్నారు.