బయో మెడికల్ వ్యర్థాలను చెత్తలో కలిపితే చర్యలు: కలెక్టర్ రాజర్షి షా

బయో మెడికల్ వ్యర్థాలను చెత్తలో కలిపితే చర్యలు: కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: హాస్పిటల్స్, ఇండస్ట్రీల్లో ఉత్పత్తయ్యే బయో మెడికల్​వ్యర్థాలను సాధారణ చెత్తలో కలిపి పడేస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్​కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు. బయో మెడికల్ వెస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్- అమలుపై మంగళవారం సాయంత్రం కలెక్టర్​ క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన సంస్థల ద్వారా మాత్రమే బయో మెడికల్ వ్యర్థాలను  శాస్త్రీయ పద్ధతిలో ధ్వంసం చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. 

బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రాణాంతకమని, ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పు కలగవచ్చని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్​ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, కమిటీ సభ్యులు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సంస్థల ప్రతినిధులు  పాల్గొన్నారు.