మ్యూచువల్ ఫండ్స్‌లో ఎగబడి ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ సీఏ చెప్పిన నిజాలు వింటే మీ మైండ్ పోతుంది..!

మ్యూచువల్ ఫండ్స్‌లో ఎగబడి ఇన్వెస్ట్ చేస్తున్నారా..? ఈ సీఏ చెప్పిన నిజాలు వింటే మీ మైండ్ పోతుంది..!

గడచిన 3-4 ఏళ్ల నుంచి పెట్టుబడి అంటే మ్యూచువల్ ఫండ్స్ అనే స్థాయిలో ఇన్వెస్టర్లు ఉన్నారు. ఈ కాలంలో పెరిగిన పెట్టుబడి ప్రవాహాలు కూడా దీనినే సూచిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ సహీ హై అంటూ యాడ్స్, వీటిని ప్రమోట్ చేస్తూ చాలా మంది ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేయటంతో కొత్తగా చాలా మంది పెట్టుబడిదారులు వీటిలోకి వస్తున్నారు. అయితే చాలా మంది 30 శాతం, 40 శాతం రాబడులు కోరుకుంటూ ఇందులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడితో లాభాలే లాభాలు అన్న తరహా ప్రచారం పెరగటంతో ఎస్ఐపీ ఇన్వెస్టర్ల సంఖ్య భారీగా పెరిగింది. 

అయితే అసలు మ్యూచువల్ ఫండ్స్ రాబడులపై గడచిన 20 ఏళ్లకు సంబంధించి చేసిన స్టడీ షాకింగ్ విషయాలను చెబుతోంది. దీనిపై చార్టెడ్ అకౌంటెంట్ శ్రుతి ఇనానీ తన లింక్డిన్ ఖాతాలో రిటైల్ పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక చేశారు. తాను కాడా 2021లో తొలిసారిగా ఎస్ఐపీ పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ లో ప్రారంభించినట్లు చెప్పారు శ్రుతి. అప్పటి నుంచి తాను కూడా రెగ్యులర్ గా పెట్టుబడి పెడుతున్నానని కానీ తాజాగా సింగపూర్ కేంద్రంగా ఉన్న రీసెర్చర్ రాజన్ రాజు రీసెర్చ్ డేటా చూసి తాను చేసింది తప్పా అనే అయోమయంలో ఉన్నట్లు వెల్లడించారు. 

రాజు 2005 నుంచి 2025 మధ్య అంటే 20 ఏళ్ల కాలంలో ఎన్ఎస్ఈ సూచీలకు సంబంధించిన ఎస్ఐపీ పెట్టుబడులపై స్టడీ చేపట్టారు. మూడేళ్ల కాలంలో లంప్జమ్ పెట్టుబడిదారుల కంటే ఎస్ఐపీలు కనీసం 6 శాతం నష్టాలను ఫండ్స్ అందించాయని తేలింది. ఇక 5 ఏళ్ల కాలంలో పెట్టుబడిపై 2-3 శాతం మధ్య నష్టాలు వచ్చే చాన్స్ ఉన్నట్లు తేలింది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులపై సున్నా రాబడులు వచ్చినట్లు.. సగటున ఇన్వెస్టర్లకు 10 శాతం నష్టాలు వస్తున్నట్లు స్టడీ వెల్లడించింది. 

కోటక్ ఇన్టిట్యూషనల్ ఈక్విటీస్ 2021 నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టిన ఎస్ఐపీల్లో 40 శాతం జీరో రిటర్న్స్ ఇచ్చినట్లు వెల్లడించింది. ప్రధానంగా స్మాల్ క్యాప్ కంపెనీలు లాభాలను అందిస్తాయంటూ భారీగా ప్రచారం జరిగింది. అయితే గడచిన 5 ఏళ్ల కాలంలో ఇవి 14 శాతం లాభాలు ఇవ్వలేవని వెల్లడైంది. ఇవన్నీ సామాన్య పెట్టుబడిదారులకు అలాగే కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్లకు తెలియకపోవటంతో కొత్తగా ఎస్ఐపీ కోసం తెరవబడుతున్న అకౌంట్ల సంఖ్య 35 శాతం పెరిగిందని తేలింది. దీనిపై సీఏ కామెంట్ చేస్తూ ఎస్ఐపీలు మ్యాజిక్ చేయలేవని గుర్తించాలన్నారు. మార్కెట్ క్రాష్ సమయంలో అమ్మేవారు, రిస్క్ తీసుకుని ముందుకెళ్లేవారు ఇద్దరూ ఉంటారని చెప్పారు.