మంత్రి పొన్నంను కలిసిన అర్బన్‌‌ బ్యాంకు చైర్మన్‌‌

మంత్రి పొన్నంను కలిసిన అర్బన్‌‌ బ్యాంకు చైర్మన్‌‌

కరీంనగర్ టౌన్, వెలుగు: అర్బన్ బ్యాంకు చైర్మన్‌‌ కర్ర రాజశేఖర్‌‌‌‌తోపాటు పలువురు డైరెక్టర్లు మంగళవారం హైదరాబాద్‌‌లో బీసీ సంక్షేమ, రవాణా శాఖా మంత్రి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

అంతకుముందు కరీంనగర్‌‌‌‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధితో పాటు ఖాతాదారులకు మంచి సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వరాల జ్యోతి, ముద్దసాని శ్వేత, కన్నసాయి, అనురాసు కుమార్, సాయికృష్ణ, ప్రశాంత్ దీపక్, కిషన్, తదితరులు ఉన్నారు.