రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలి : చెవుటు మల్లేశ్

రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలి : చెవుటు మల్లేశ్

మంచిర్యాల/లోకేశ్వరం/సారంగాపూర్, వెలుగు: పెండింగ్ లో ఉన్న  స్కాలర్​షిప్, ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చెవుటు మల్లేశ్, మిట్టపల్లి తిరుపతి డిమాండ్​ చేశారు. 

జిల్లా కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.విద్యార్థుల చదువులు నష్టపోకుండా చూడాలని కోరారు. ప్రభుత్వానికి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ విద్యారంగంపై లేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి అల్లం సాయి తేజ, యూఎస్ఎఫ్ఐ నాయ. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థల యజమాన్యాలతో చర్చలు జరిపి కులు పాల్గొన్నారు.

లోకేశ్వరం, సారంగాపూర్​లో.. 

రీయింబర్స్ మెంట్​ను వెంటనే విడుదల చేయాలని లోకేశ్వరంలో డీటీడీసీ ఆర్గనైజర్ బి.సాయిలు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి సమస్య లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ నాలుగేండ్లుగా కాలేజీల రీయింబర్స్ మెంట్​తో పాటు, స్కాలర్​షిప్​ నిధులు ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలుతరగతులు నిర్వహించుకునే పరిస్థితిలో లేవన్నారు.

 వెంటనే రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. విష్ణువర్ధన్, గంగయ్య, రవీందర్, రాజేశ్వర్, రాహుల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సారంగాపూర్ మండలంలోని ఏకలవ్య, పద్మావతి డిగ్రీ కళాశాలాలు నిరవధిక బంద్​ను రెండో రోజు కొనసాగించాయి.