మల్లాపూర్‌‌‌‌లో మొక్కజొన్న రైతుల నిరసన

మల్లాపూర్‌‌‌‌లో మొక్కజొన్న రైతుల నిరసన

మల్లాపూర్, వెలుగు: సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి మొక్కజొన్న పంట కొనుగోళ్లను స్పీడప్ చేయాలని మల్లాపూర్‌‌‌‌లో రైతులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాల్లాపూర్ మండలంలో 23 గ్రామాలు ఉన్నాయని, మండలకేంద్రంలో ఒక్కటే కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేయడంతో దూరభారంతోపాటు కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. దీంతోపాటు కొనుగోలు సెంటర్‌‌‌‌లో మౌలిక వసతులు లేవని, హమాలీలు కూడా అందుబాటులో లేక ఇబ్బందులు  పడుతున్నామన్నారు.