నాన్నలేడని… కుస్తీ పోటీలు ఆపేసిండు

నాన్నలేడని… కుస్తీ పోటీలు ఆపేసిండు

సక్సెస్‌‌‌ సాధించడం ఎంత కష్టమో.. ఆ తర్వాత వచ్చే పేరుని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. కానీ, చిన్నవయసులోనే  ఓటమెరుగని వీరుడిగా లెగసీ సాధించిన కుస్తీ వీరుడు హబీబ్‌‌‌‌ నుర్మోహమదోవ్‌‌‌‌.. అనూహ్యంగా కెరీర్‌‌‌‌కి గుడ్‌‌‌‌ బై చెప్పేశాడు.  తండ్రి పక్కన లేకుండా తన సక్సెస్‌‌‌‌ ఊహించుకోలేకపోతున్నాననే ఎమోషనల్ మెసేజ్‌‌‌‌తో రింగ్ నుంచి బయటకు వచ్చేశాడు 32 ఏండ్ల ఈ రష్యన్‌‌‌‌ ఛాంపియన్‌‌‌

హబీబ్‌‌‌‌ నుర్మోహమ్మదోవ్‌‌‌‌.. రష్యన్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్ మార్షల్ ఆర్ట్స్‌‌‌‌ ఫైటర్‌‌‌‌. యూఎఫ్‌‌‌‌సీ(అల్టిమేట్‌‌‌‌ ఫైటింగ్ ఛాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌) టైటిల్‌‌‌‌ గెలిచిన తొలి ముస్లిం వ్యక్తి.  ఇతని తండ్రి అబ్దుల్‌‌‌‌మనాప్ ఒక జిమ్‌‌‌‌ ట్రైనర్‌‌‌‌. చిన్నప్పటి నుంచి తండ్రి జిమ్‌‌‌‌లో పెరగడంతో మార్షల్ ఆర్ట్స్‌‌‌‌పైన ఇంట్రెస్ట్‌‌‌‌ పెంచుకున్నాడు హబీబ్‌‌‌‌. తండ్రి ఎంకరేజ్‌‌‌‌మెంట్‌‌‌‌తో సాంబో, జూడో, రెజ్లింగ్‌‌‌‌లో ట్రైనింగ్ తీసుకున్నాడు. 2008 నుంచి కెరీర్‌‌‌‌లో ఉన్న హబీబ్‌‌‌‌..  ఎక్కువకాలం లైట్ వెయిట్ ఛాంపియన్‌‌‌‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఇన్‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌లో 24 మిలియన్ల ఫాలోవర్స్‌‌‌‌తో రష్యాలో ‘హయ్యెస్ట్ ఫాలోవర్‌‌‌‌ సెలబ్రిటీ’గా ఉన్నాడు. రీసెంట్‌‌‌‌గా రిటైర్‌‌‌‌మెంట్ తర్వాత పాయింట్స్ ఆధారంగా ఇతనికి ఫస్ట్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌ దక్కడం విశేషం.క్సెస్‌‌‌‌ సాధించడం ఎంత కష్టమో.. ఆ తర్వాత వచ్చే పేరుని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం. కానీ, చిన్నవయసులోనే  ఓటమెరుగని వీరుడిగా లెగసీ సాధించిన కుస్తీ వీరుడు హబీబ్‌‌‌‌ నుర్మోహమదోవ్‌‌‌‌.. అనూహ్యంగా కెరీర్‌‌‌‌కి గుడ్‌‌‌‌ బై చెప్పేశాడు.  తండ్రి పక్కన లేకుండా తన సక్సెస్‌‌‌‌ ఊహించుకోలేకపోతున్నాననే ఎమోషనల్ మెసేజ్‌‌‌‌తో రింగ్ నుంచి బయటకు వచ్చేశాడు 32 ఏండ్ల ఈ రష్యన్‌‌‌‌ ఛాంపియన్‌‌‌‌.

తల్లి మాటతో..

హబీబ్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ రేట్‌‌‌‌ 100 పర్సంట్‌‌‌‌. అంటే..  ఆడిన ప్రతీ మ్యాచ్ గెలిచాడు.  వరుస విజయాలతో 29–0 రికార్డు నెలకొల్పాడు. ప్రతీ గేమ్‌‌‌‌లో కోచ్‌‌‌‌గా తండ్రి అబ్దుల్‌‌‌‌మనాప్‌‌‌‌.. పక్కనే ఉండి ఆ సక్సెస్‌‌‌‌ని ఎంజాయ్‌‌‌‌ చేసేవాడు. అయితే లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైంలో అబ్దుల్‌‌‌‌మనాప్‌‌‌‌కి గుండె ఆపరేషన్‌‌‌‌ జరిగింది. కోలుకుని డిశ్చార్జ్‌‌‌‌ అయ్యే టైంకి ఆయన కొవిడ్‌‌‌‌ బారిన పడ్డాడు.  నెలపాటు పోరాడి.. చివరికి ప్రాణం విడిచాడు.  తండ్రి మరణం తర్వాత అక్టోబర్‌‌‌‌ చివర్లో జరిగిన యూఎఫ్‌‌‌‌సీ 254 ఈవెంట్‌‌‌‌లో జస్టిన్‌‌‌‌ గేజితో మ్యాచ్‌‌‌‌లో పాల్గొన్నాడు హబీబ్‌‌‌‌. 22–3 పాయింట్లతో గేజిని చిత్తు చేశాడు. ఆ విక్టరీతో ఫ్యాన్స్‌‌‌‌ కేరింతలు కొడుతుండగా.. ఇది తన చివరి మ్యాచ్‌‌‌‌ అని బాంబ్ పేల్చాడు హబీబ్‌‌‌‌. ‘‘ఈ మ్యాచ్‌‌‌‌కి వచ్చే ముందు నా తల్లి నన్ను ఒక మాట అడిగింది. ‘మీ నాన్న లేకుండా మ్యాచ్‌‌‌‌ ఆడుతున్నావా?’ అని.  నా ప్రతీ గెలుపు మా నాన్నదే.  అలాంటప్పుడు ఆయనే లేకుండా నేను రింగ్‌‌‌‌లోకి దిగడం కరెక్ట్‌‌‌‌ కాదు. అందుకే నా తల్లికి ప్రామిస్ చేశా. మాటకి కట్టుబడి ఈ మ్యాచ్‌‌‌‌తో నా కెరీర్‌‌‌‌ని ముగిస్తున్నా’ అని హబీబ్‌‌‌‌ చెప్పడంతో అక్కడున్న ఫ్యాన్స్ అంతా కంటతడి పెట్టుకున్నారు.