చనిపోయే ముందు ఓ తండ్రి కోరిన కోరికేంటో తెలుసా?

చనిపోయే ముందు ఓ తండ్రి కోరిన కోరికేంటో తెలుసా?

ఈ ఫోటో చూస్తే మీకో విషయం అర్ధమవ్వాలి.. లేదంటే ఫర్వాలేదు. చనిపోయే ముందు ఎవరైనా తన ఆఖరి కోరిక ఏదైనా ఉంటే దాన్ని తన కుటుంబ సభ్యుల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. అలాంటి వార్తే ఈ విషయం. అమెరికాలోని విస్కిన్‌సన్ సిటీలో ఓ వ్యక్తి చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తనకు చావు దగ్గరికొచ్చిందని అర్ధమైందో ఏమో గానీ.. తన నలుగురు కొడుకులని ఆస్పత్రికి పిలిచి తన చివరి కోరికను తీర్చమని అడిగాడు. కొడుకులు కూడా తండ్రి మాట కాదనకుండా అతని కోరికను తీర్చారు. ఇంతకీ.. ఆ తండ్రి కోరిన కోరిక ఏంటో తెలుసా.. తనకు చివరిసారిగా తన కొడుకులతో కలిసి బీరు తాగాలని ఉంది అని చెప్పాడు. ఇక చేసేదేముంది.. ఆ కొడుకులు బీరు బాటిళ్లు తీసుకొచ్చి తండ్రితో కలిసి ఆస్పత్రిలోనే తాగారు. తాత, తన కొడుకులతో కలిసి బీరు తాగుతున్న ఫోటోను మనవడు ఆడమ్ స్కీమ్ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇంకేముంది నెట్టింట్లో క్షణాల్లో వైరలయింది ఆ ఫోటో. క్షణాల్లోనే ఆ ఫోటోకు 13 వేల రీట్వీట్లు, 1,51000 లైకులు, 2000 కామెంట్లు వచ్చి పడ్డాయి. ఈ ఫోటోను చూసిన ఒక మహిళ అయితే ఏకంగా.. తాను తన నానమ్మతో కలిసి ఆస్పత్రిలో చివరిసారిగా తీసుకున్న ఫోటోలను జతచేసింది.