సమాజంలో ఆడ పిల్ల పుడుతుందని తెలిస్తే చాలు... బయటకు రాకుండానే చిదిమేసేవారు. ఇప్పుడు కొంత మారినా అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మగ పిల్లలు లేకపోతే అన్న కొడుకునో.. చెల్లి కొడుకుకో దత్తత తీసుకుంటారు. కాని ఆడపిల్లను దత్తత తీసుకొనేందుకు ఎవరూ ముందుకు రారు. కాని ఇప్పుడు ఓ ఆదర్శ మూర్తి చరిత్రను తిరగరాస్తూ.. ఆరుగురు మగ పిల్లలున్నా సరే... తన తమ్ముడి కూతురిని దత్తత తీసుకొని ఔరా అనిపించుకున్నాడు.
పిల్లలు లేని వారు లేదా అసహాయ స్థితిలో ఉన్న పిల్లలను పెంచాలనుకునే వారు పిల్లలను దత్తత తీసుకుంటారు. అయితే దత్తత తీసుకొనేటప్పుడు సాధారణంగా మగ పిల్లలను తీసుకుంటారు. కాని తాజాగా ఇప్పుడు ఆరుగురు మగ్గపిల్లల తండ్రి ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్న ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.సాధారణంగా ప్రజలు మగ పిల్లల కోసం తపిస్తుంటారు. చాలా మంది ఆడపిల్లలు ఉన్నా.. మగపిల్లలను దత్తత తీసుకుంటారు. కాని ఇప్పుడు ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పిల్లలు లేకపోతే ఎవరో ఒకరని ఆడపిల్లను దత్తత తీసుకున్న వారిని చూశాం. కాని హర్యానాలో ఫిరోజ్‌పూర్ జిర్కా బ్లాక్‌లోని రవ్లీ గ్రామంలో ఆరగురు మగ పిల్లల తండ్రి ఆడపిల్లను దత్తత తీసుకొన్నారు.
హర్యానాలోని రవ్లీ గ్రామానికి చెందిన జంషెడ్ అలియాస్ జమ్మి తన తమ్ముడి కుమార్తెను దత్తత తీసుకున్నాడు. తన తమ్ముడు ఇర్ఫాన్ అలియాస్ ఇఫ్పీకి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొన్ని పరిస్థితులు కారణంగా వారి బంధువులు ఇర్ఫీ, జమ్మిలతో చర్చలు జరిపి పరస్పర అంగీకారం కుదిర్చారు. దీంతో 30 రోజుల పసికందును జమ్మి కుటుంబం దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది. జంషెడ్ అలియాస్ జమ్మి అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా తేడా లేదు. ఇద్దరూ ఒకటే అని సందేశం ఇచ్చారు. అమ్మాయిలు కూడా అబ్బాయిల కంటే అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా బాగా పెరగాలన్నారు. జమ్మి కు ఆరుగురు మగ పిల్లలున్నా.. అమ్మాయిని దత్తత తీసుకోవడం గర్వించదగ్గ విషయమని గ్రామ సర్పంచ్ హనీఫ్ ఖాన్ తెలిపారు.

