Fathers Day : నాన్నకు ప్రేమతో.. ఫాదర్స్ డే విషెస్ ఇలా చెప్పండి

Fathers Day : నాన్నకు ప్రేమతో.. ఫాదర్స్ డే విషెస్ ఇలా చెప్పండి

చాలా మంది తల్లుల గురించే చెప్తూ ఉంటారు. 9నెలలు మోసి, కన్న ఆ మాతృమూర్తిని ఎప్పుడూ పొగుడుతూ ఉంటాం. కానీ మనం కొన్ని సార్లు తక్కువగా చూసే తండ్రి గురించి మాత్రం అంతగా మాట్లాడుకోము. వాస్తవంగా చెప్పాలంటే 9నెలలు తల్లి మోస్తే.. ఆ తర్వాత మన జీవితాన్నంతా తండ్రి మోస్తాడు. తన భావాలను మనసులోనే దాచుకుంటూ మన భవిష్యత్ కోసం బాటలు వేస్తాడు. నిరంతరం శ్రమిస్తూ పిల్లల ఆనందమే తన ఆనందంగా భావించే వ్యక్తి ఉత్తమ తండ్రిగా చెప్పుకోవచ్చు. మన అవసరాలను తీర్చడానికి ఎల్లప్పుడూ కష్టపడే ఆయనకు మాత్రం అతని అవసరాలు తీర్చే, ఆయన ప్రాముఖ్యాన్ని చెప్పుకోవడానికి జరుపుకునేదే ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డేని ప్రతి సంవత్సరం జూన్‌లో మూడవ ఆదివారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం భారతదేశం, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు జూన్ 18న ఫాదర్స్ డే 2023ని జరుపుకోబోతున్నాయి.  ఈ సందర్భంగా తండ్రిపై ప్రేమను వ్యక్తం చేసేందుకు కొన్ని కోట్స్ ఇక్కడ ఉన్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కోట్స్, శుభాకాంక్షలు, వాట్సాప్ అండ్ ఫేస్ బుక్ గ్రీటింగ్స్

  • ఇన్నేళ్లూ నా జీవితంలో ప్రేమ, ఆదరణ, ఆనందాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు. హ్యాపీ ఫాదర్స్ డే, నాన్న!
  • ఉత్తమ వ్యక్తికి హ్యాపీ ఫాదర్స్ డే! ఈ ప్రత్యేకమైన రోజున ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి.
  • ఈ రోజు మీ రోజు నాన్న. దాన్ని ఆస్వాదించండి. మీరంటే మాకు ఎంత ఇష్టమో ఈ రోజు తెలుసుకోండి!
  • మీరు నా జీవితంలో ఓ గిఫ్ట్ లాంటి వారు. పితృ దినోత్సవ శుభాకాంక్షలు.
  • నాన్న, మీరు నాకు చాలా ఇచ్చారు. ఇదిగో నీకోసం.
  • మీతో మాట్లాడటం, మీతో గడపడం, మీ సలహా వినడం నాకు చాలా ఇష్టం. ప్రతి రోజుకూ ధన్యవాదాలు.  ముఖ్యంగా ఈ రోజు!
  • నమ్మశక్యం కాని తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఎదుగులలో, కష్టాల్లో ఎల్లప్పుడూ నాకు అండగా ఉన్నారు. హ్యాపీ ఫాదర్స్ డే, నాన్న!
  • ఈ రోజు నేను జీవించే జీవితాన్ని నాకు అందించి, నన్ను పెంచడానికి, పోషించడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వ్యక్తికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు.
  • ఐ లవ్యూ నాన్న.. నాన్నకు ప్రేమతో..
  • మా కోసం ఎంతో చేస్తున్న నాన్నే నా రియల్ హీరో.. మా నాన్నకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు
  • నాన్నే ఆదర్శం.. నాన్నే మార్గదర్శి.. నాన్న దారే నా రహదారి.. హ్యాపీ ఫాదర్స్ డే
  • అడక్కుండానే ఎన్నో ఇచ్చావ్.. అడిగిన ప్రతిదీ తెచ్చి ఇచ్చావ్.. నాన్నకు ప్రేమతో..

మీరు కూడా మీ నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోండి.. విషెస్ చెప్పండి.. నాన్నతో గడపండి.. నాన్నకు ప్రేమతో.. తోడుగా నీడగా..