భారత్‌‌లో పరిస్థితి దారుణం.. వెంటనే లాక్‌డౌన్ పెట్టాలె

భారత్‌‌లో పరిస్థితి దారుణం.. వెంటనే లాక్‌డౌన్ పెట్టాలె

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా పరిస్థితులపై అమెరికా పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్, వైట్ హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వయిజర్ డాక్టర్ ఆంథోని ఫౌసీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వెంటనే లాక్‌‌డౌన్‌‌ పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన మరోసారి సూచించారు. దీంతోపాటు పెద్దఎత్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని, తాత్కాలిక హాస్పిటల్స్‌ను భారీ సంఖ్యలో నిర్మించాలన్నారు. ‘భారత్‌లో కరోనా పరిస్థితి దారుణంగా ఉంది. భారీ సంఖ్యలో ప్రజలు ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నప్పుడు అందరి కేర్ తీసుకోవడం కష్టమే. ఆస్పత్రుల్లో బెడ్‌ల సంఖ్య, ఆక్సిజన్ సప్లయ్ కొరత ఉండటాన్ని బట్టి భారత్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ సమయంలో అందరూ కలసి ఇండియాకు అవసరమైన సాయం చేయాలి’ అని ఫౌసీ పేర్కొన్నారు.