ఎఫ్సీఐ వార్షిక క్యాలెండర్ రిలీజ్ చేయాలె

ఎఫ్సీఐ వార్షిక క్యాలెండర్ రిలీజ్ చేయాలె

హైదరాబాద్: వార్షిక క్యాలెండర్ను రిలీజ్ చేయాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎఫ్సీఐని కోరారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా ఎఫ్సీఐపై కామెంట్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వడ్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదని, దీనంతటికీ కేంద్రమే కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎఫ్సీఐ వార్షిక క్యాలెండర్ రిలీజ్ చేయకపోవడం రైతులు ఇబ్బందిపడుతున్నారన్నారు. వార్షిక క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల ఆయా రాష్ట్రాలు ఎఫ్సీఐ క్యాలెండర్ కు అనుగుణంగా రైతులను అలెర్ట్ చేస్తాయన్నారు. ధాన్యం సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

‘వీరమల్లు’ కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్

గోటబయ రాజీనామా  ప్రసక్తే లేదు