హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నెల 11వ తేదీ పోలింగ్ రోజున స్థానిక సెలవు ప్రకటిస్తూ హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగులకు జనరల్ హాలిడే తో పాటు ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే ప్రభుత్వ భవనాలు, విద్యాసంస్థల భవనాలకు పోలింగ్ కు ముందు రోజు, పోలింగ్ జరిగే రోజు, ఓట్ల లెక్కింపు తేదీల్లో సెలవును ప్రకటించినట్లు పేర్కొన్నారు.
