మీరు ఉండే ప్రాంతం ఆధారంగా బ్యాంక్ వడ్డీ రేట్లు

మీరు ఉండే ప్రాంతం ఆధారంగా బ్యాంక్ వడ్డీ రేట్లు

ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రెసిడెంట్ మరియు నాన్-రెసిడెంట్ ఫిక్సుడ్ డిపాజిట్ల కోసం వడ్డీ రేట్లను పెంచింది. 500 రోజుల రెసిడెంట్ సీనియర్ సిటిజన్ల డిపాజిట్లకు వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచింది. నాన్ రెసిడెంట్ కు 7.75 శాతానికి పెంచింది. 500 రోజుల పాటు విత్‌డ్రా చేయని డిపాజిట్లపై వడ్డీ రేటు 7.90 శాతానికి పెంచింది. 

రెసిడెంట్స్ కి గరిష్టంగా 8.40 శాతం వడ్డీని రాబడిగా అందిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎస్ బీఐ, ప్రైవేట్ రంగ సంస్థ హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, యాక్సీస్ బ్యాంక్, డీసీబీ బ్యాంకులు కూడా వడ్డీ రేటు భారీగా పెంచిన సంగతి తెలిసిందే.