ఫెనెస్టా షోరూం షురూ.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏడో షోరూమ్‌‌‌‌‌‌‌‌

ఫెనెస్టా షోరూం షురూ.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఏడో షోరూమ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ప్రీమియం కిటికీలు, తలుపుల బ్రాండ్ ఫెనెస్టా, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో తన ఏడో షోరూమ్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. ఇది తెలంగాణలో ఈ సంస్థకు పదో షోరూమ్. ఇందులో యూపీవీసీ, అల్యూమినియం కిటికీలు, తలుపులు, ఫసాడ్‌‌‌‌‌‌‌‌లు, సాలిడ్ ప్యానెల్ డోర్స్‌‌‌‌‌‌‌‌ లభిస్తాయి.

ఈ సందర్భంగా ఫెనెస్టా బిజినెస్ హెడ్ సాకేత్ జైన్ మాట్లాడుతూ, ఈ కొత్త షోరూమ్‌‌‌‌‌‌‌‌ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన ప్రొడక్టులను, పర్సనలైజ్​డ్ ​సర్వీసులను పొందవచ్చని అన్నారు.

ఇళ్లు కట్టుకునేవారికి, వాస్తుశిల్పులకు, బిల్డర్లకు కావాల్సిన ప్రొడక్టులను, సేవలను అందిస్తుందని చెప్పారు.  దేశవ్యాప్తంగా తమకు 400 మందికి పైగా డీలర్ల నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ ఉందని, నేపాల్, భూటాన్, మాల్దీవులలోనూ సేవలను అందిస్తున్నట్లు జైన్​ వివరించారు.