శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో  ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ వేడుకలు

శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో  ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ వేడుకలు

ఉత్తర కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని ఫ్రీమాంట్ నగరంలో "ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌" వేడుకలు ఘనంగా జరిగాయి. FOG (Festival of Globe) సంస్థ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్థానిక భారతీయ సాంస్కృతిక సంస్థలు తమ తమ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలతో నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. 

విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA ) సంస్థ భారతీయ మహిళా శక్తిని ప్రపంచానికి తెలియజెప్పేలా శకటాన్ని రూపొందించారు. "రాణి రుద్రమ దేవి" తో వివిధ రంగాలలో రాణించిన "ఇందిరా గాంధీ', ప్రతిభ పాటిల్, మదర్ థెరిసా, ప్రియా జింగన్, కిరణ్ బేడి, కల్పనా చావ్లాల ప్రతిమలతో అలంకరించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. WETA శకటంతో పాటు ఆ సంస్థ సేవ కార్యక్రమాలకుగానూ  " బెస్ట్ కమ్యూనిటీ సేవ" అవార్డును అందుకుంది. శకటంలో వివిధ నాయకుల వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్న చిన్నారులను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 2వేల మంది హాజరయ్యారు. 

"తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట’ అనే నినాదంతో తెలుగు మహిళల "మహిళ సాధికారతే "లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన  ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ సంస్థను రెండేండ్ల క్రింద ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేశారు. మహిళకు  అవకాశాలు కల్పించడంతో పాటు వారిలో సృజనాత్మకతను వెలికితీసి కలలను సాకారం చేసుకునేందుకు ఈ సంస్థ తోడ్పాటు అందిస్తోంది. మహిళా నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియచేసేందుకు వేదికగా పనిచేస్తోంది. 

వేడుకల్లో ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల , అడ్వైజరీ కౌన్సిల్ కో ఛైర్మన్ డాక్టర్  అభితేజ కొండా , ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి, కోర్ కమిటీ సభ్యులైన అనురాధ, హైమ, పూజ , విశ్వ, మీడియా ఛైర్ పర్సన్ సుగుణ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు.