కేరళకు జ్వరం పట్టింది.. రెండు లక్షల మంది మంచం పట్టారు

కేరళకు జ్వరం పట్టింది.. రెండు లక్షల మంది మంచం పట్టారు

కొన్ని రోజులుగా కేరళలో రోజువారీ జ్వరం కేసులు 10వేలు దాటుతున్నాయి. జూన్ 20న రాష్ట్రంలో 13వేల 46 జ్వరం కేసులు నమోదయ్యాయి. మే 20 నాటికి రాష్ట్రంలో కేవలం 6,106 జ్వరపీడితులు మాత్రమే ఉన్నట్టు సమాచారం. ఒక నెలలోనే రోజువారీ కేసులు రెట్టింపు కావడం అత్యంత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,87,480 జ్వరం కేసులు నమోదయ్యాయి.

కేరళలో జ్వరపీడితులు విజృంభిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ జూన్ 21న డెంగ్యూ, లెప్టోస్పిరోసిస్‌పై అప్రమత్తం చేసి క్లీనింగ్ డ్రైవ్‌కు పిలుపునిచ్చారు. ఆరోగ్య శాఖ ప్రకారం, రాష్ట్రంలో 43 డెంగ్యూ, 15 లెప్టోస్పిరోసిస్ కేసులు కాకుండా 13 వేల 387 జ్వర కేసులు నమోదయ్యాయి. వైరల్ ఫీవర్‌పై పోరాడాలని విజయన్ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో ప్రజలను కోరారు.

దోమల వృద్ధికి గల మూలాలను నాశనం చేయడానికి ప్రజలు క్లీనింగ్ డ్రైవ్‌కు వెళ్లాలి. స్థానిక స్వపరిపాలన సంస్థలు శుభ్రపరచడం, వ్యర్థాల తొలగింపు సమర్థవంతంగా జరిగేలా చూడాలి. తోటల రంగం, నిర్మాణ స్థలాలు, స్క్రాప్ డంపింగ్ యార్డులు, వలస కార్మికుల నివాసాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైరల్ ఫీవర్ రాష్ట్రానికి ముప్పుగా మారకుండా చూసేందుకు ప్రజలు ముందుకు రావాలి’’ అని సీఎం విజయన్ అన్నారు.