తెలంగాణలో పలుచోట్ల వర్షాలు..

తెలంగాణలో పలుచోట్ల వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఆదివారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడిందని చెప్పారు. అదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షం పడిందని తెలిపారు. అందుకే ఉష్ణోగ్రతలు తగ్గుమొఖం పట్టాయని చెప్పారు. ఫిబ్రవరి 16 నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరుగుతాయని అంచనా వేశారు. 

మరో వైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం చాలా ప్రాంతాలు 33 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో 34 డిగ్రీల సెల్సియస్‌ను అధిగమించిన ఎండ ప్రభావితం చూపలేక పోయింది.  

ALSO READ :- ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు.. రైతు సంఘాలతో ముగ్గురు కేంద్ర మంత్రుల చర్చలు