
సికింద్రాబాద్, వెలుగు : ట్రాక్ మెయింటెనెన్స్ పనులు కారణంగా అక్టోబర్1 నుంచి 31 వరకు పలు మార్గాల్లో రెగ్యులర్గా తిరిగే రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
కాచిగూడ– -నిజామాబాద్– -కాచిగూడ, మేడ్చల్– -లింగంపల్లి– -మేడ్చల్, మేడ్చల్– -సికింద్రాబాద్– మేడ్చల్ మధ్య నడిచే 12 సర్వీసులను రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.