కార్వీ ఇన్వెస్టర్ల క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌కు జూన్ 2 డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌.. త్వరగా దరఖాస్తు చేయాలని కోరిన సెబీ

కార్వీ ఇన్వెస్టర్ల క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌కు జూన్ 2  డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌.. త్వరగా దరఖాస్తు చేయాలని కోరిన సెబీ

న్యూఢిల్లీ: డిఫాల్ట్ అయిన బ్రోకరేజ్ కంపెనీ  కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌)కు సంబంధించి తమ క్లెయిమ్స్‌‌‌‌‌‌‌‌ను త్వరగా ఫైల్ చేయాలని ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ శుక్రవారం కోరింది. ఇందుకు  జూన్ 2 డెడ్‌‌‌‌‌‌‌‌లైన్. ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ  నవంబర్ 23, 2020న కేఎస్‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌ను డిఫాల్టర్‌‌‌‌‌‌‌‌గా డిక్లేర్ చేసింది. దీని తర్వాత,  ఈ డిఫాల్ట్ బ్రోకర్‌‌‌‌‌‌‌‌పై క్లెయిమ్స్ సబ్మిట్ చేయమని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు.

ఫైనల్ సబ్మిషన్ డేట్‌‌‌‌‌‌‌‌గా జూన్ 2, 2025 ను  నిర్ణయించారు. డెడ్‌‌‌‌‌‌‌‌లైన్ గురించి హైలైట్ చేస్తూ,  "కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌పై ఇన్వెస్టర్ల క్లెయిమ్స్ సబ్మిట్ చేయడానికి డెడ్‌‌‌‌‌‌‌‌లైన్ త్వరలో ముగుస్తోంది.  కాబట్టి ఇన్వెస్టర్లు ఈ డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ను గమనించి, ఇంకా క్లెయిమ్స్ ఫైల్ చేయకపోతే వెంటనే చేయాలి" అని సెబీ తన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.

సహాయం కోసం ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈ  టోల్-ఫ్రీ నంబర్ 1800 266 0050 (ఐవీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆప్షన్ 5 ను సెలెక్ట్ చేయండి) ద్వారా కాల్ చేయవచ్చు లేదా defaultisc@nse.co.inకు ఈ–మెయిల్ చేయవచ్చని సెబీ తెలిపింది. ఏప్రిల్ 2023లో, సెబీ కేఎస్‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌ను, దాని సీఎండీ  సి. పార్థసారథిని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఏడేళ్లపాటు బ్యాన్ చేసింది.  అలాగే క్లయింట్స్ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను తప్పుగా వాడినందుకు  (పవర్ ఆఫ్ అటార్నీని దుర్వినియోగం చేసి) వాళ్లపై రూ.21 కోట్ల  పెనాల్టీ విధించింది. 

కేఎస్‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌, క్లయింట్స్ నుంచి పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా వారి సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌ను తనఖా  పెట్టి భారీగా ఫండ్స్ సేకరించింది. ఈ ఇన్వెస్టర్లకు  వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చింది.  కానీ, వాటిని నెరవేర్చకుండా, ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను కేఎస్‌‌‌‌‌‌‌‌బీఎల్‌‌‌‌‌‌‌‌తో లింక్ ఉన్న కంపెనీకి  మళ్లించింది.  దీనివల్ల క్లయింట్ సెక్యూరిటీస్, ఫండ్స్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో డిఫాల్ట్‌‌‌‌‌‌‌‌లు జరిగాయి.