ఎలక్షన్స్​పై గైడ్ లైన్స్ ఇవ్వండి..ఈసీకి ఎఫ్​జీజీ లేఖ

ఎలక్షన్స్​పై గైడ్ లైన్స్ ఇవ్వండి..ఈసీకి ఎఫ్​జీజీ లేఖ

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల కమిషన్  తమ గైడ్ లైన్స్ ను మార్చాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్​జీజీ) సెక్రటరీ పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.  ఎన్నికల టైమ్ లో అధికార పార్టీ లబ్ధి పొందేందుకు అధికార దుర్వినియోగం చేయకుండా కట్టడి చేయాలని కోరారు. తెలంగాణ లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు సలహాలు, సూచనలతో  కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో రాజీవ్ కుమార్ కు ఆయన లేఖ రాశారు.  ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నపుడు  రూల్స్ ను కఠినంగా అమలు చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.  రూ.25వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కువ తరలిస్తే కేసు నమోదు చేసి కోర్టులో డిపాజిట్ చేయటం వంటి రూల్స్ కఠినంగా అమలు చేయాలన్నారు.  ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ  చేసే అభ్యర్థిపై కేసు నమోదు చేయాలని, పోలీసులు అనామకులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ప్రభుత్వ ఖర్చుతో అధికార పార్టీలు యాడ్స్ ఇస్తున్నాయని వీటిపై ఈసీ చర్చలు తీసుకోవాలన్నారు.