మరియుపోల్​లో భీకర పోరు

మరియుపోల్​లో భీకర పోరు

కీవ్/మాస్కో: సౌత్ ఉక్రెయిన్​లోని కీలకమైన పోర్ట్ సిటీ మరియుపోల్​లో ఇంకా భీకర పోరాటం కొనసాగుతోంది. ఇప్పటికే నగరాన్ని చాలావరకూ నేలమట్టం చేసిన రష్యన్ బలగాలకు సిటీలోని అజోవ్​స్టల్ స్టీల్ ప్లాంటును స్వాధీనం చేసుకోవడం మాత్రం సాధ్యం కావట్లేదు. ప్లాంటులోని అండర్ గ్రౌండ్ టన్నెళ్లనే బంకర్లుగా వాడుకుంటూ, ప్లాంటును కంచుకోటగా మార్చుకుని ఉక్రెయిన్ బలగాలు దీటుగా పోరాడుతున్నాయి. సోవియెట్ కాలం నాటి ఈ అతిపెద్ద స్టీల్ ప్లాంటులోని భూగర్భ టన్నెల్స్, కొన్ని బిల్డింగులు పెద్ద పెద్ద బాంబులను సైతం తట్టుకునేలా ఉండటం ఉక్రెయిన్​కు కలిసివస్తోంది. స్టీల్ ప్లాంటులో సుమారు 3 వేల వరకూ ఉక్రెయిన్ సోల్జర్లు ఉన్నారని, వారికి తోడుగా మరో వెయ్యి మంది జనం ఉన్నారని చెప్తున్నారు. ఈ ప్లాంటును స్వాధీనం చేసుకుంటే మరియుపోల్ అంతా కంట్రోల్​లోకి రానుండటంతో రష్యన్ బలగాలు దాడులు తీవ్రం చేస్తున్నాయి. ప్లాంటులోని సోల్జర్లు ఇప్పటికైనా లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని రష్యా బుధవారం మళ్లీ హెచ్చరించింది. మరోవైపు ప్లాంటుపై, అక్కడికి దగ్గర్లోని ఆస్పత్రిపైనా రష్యా బాంబులు వేసింది. ఆ టైమ్​లో ఆస్పత్రిలో మొత్తం 300 మంది ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు.   

రష్యాకు 25% పవర్ లాస్ 

రష్యా ఇప్పటివరకు 25% కంబాట్ పవర్​ను నష్టపోయి ఉంటుందని అమెరికా అధికారులు అంచనా వేశారు. ఉక్రెయిన్​లోకి పంపిన సోల్జర్లు, ట్యాంకులు, హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు, బాంబులలో 25% కోల్పోయి ఉంటుందని వెల్లడించారు