ఫిఫా వరల్డ్ కప్ విజేత అర్జెంటీనా

ఫిఫా వరల్డ్ కప్ విజేత అర్జెంటీనా

ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను అర్జెంటీనా గెల్చుకుంది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 4 –2 పాయింట్లతో అర్జెంటీనా టీమ్ ఫ్రాన్స్ పై విజయ భేరి మోగించింది. మూడోసారి ప్రపంచ ఛాంపియన్ గా అర్జెంటీనా అవతరించింది. అంతకుముందు  మ్యాచ్ ప్రారంభమయ్యాక 22వ నిమిషంలో పెనాల్టీ షూట్ అవుట్ లో ‘మెస్సీ’  తొలి గోల్ సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు. అనంతరం అర్జెంటీనా ఆటగాడు డి మేరియా మరో గోల్ చేశారు. దీంతో ఫ్రాన్స్ పై అర్జెంటీనా 2  – 0 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో ఫ్రాన్స్ ఒత్తిడిలోకి జారుకుంది. ఈ తరుణంలో ఫ్రాన్స్ టీమ్ ను స్టార్ ఆటగాడు ఎంబాపే 2 వరుస గోల్స్ తో ఆదుకున్నాడు. మ్యాచ్ 79వ నిమిషంలో పెనాల్టీ షూటౌట్ ను ఎంబాపే గోల్ గా మలిచాడు. అనంతరం మరో నిమిషంలోపే ఎంబాపే రెండో గోల్ కూడా చేసి అదుర్స్ అనిపించాడు. దీంతో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్ల స్కోర్ 2 –2 పాయింట్లతో సమమైంది. మ్యాచ్ సెకండ్ హాఫ్ సమయానికి రెండు టీమ్ లు సమ స్కోర్లతో  ఉన్నాయి. ఫలితంగా గేమ్ .. ఎక్స్ ట్రా టైంకు దారితీసింది. అయితే ఈ ఎక్స్  ట్రా టైంలో అర్జెంటీనా, ఫ్రాన్స్ చెరో గోల్ చేశాయి. దీంతో మరోసారి స్కోర్ సమంగా 3–3  అయింది.

దీంతో పెనాల్టీ షూటౌట్ కు అంపైర్లు నిర్ణయించారు. అయితే షూటౌట్ అవకాశాలను గోల్స్ గా మల్చడంలో ఫ్రాన్స్ ఆటగాళ్లు విఫలమయ్యారు. పెనాల్టీ షూటౌట్ దశలో అర్జెంటీనా 4 గోల్స్ చేయగా.. ఫ్రాన్స్ కేవలం 2 గోల్స్ మాత్రమే చేసింది. దీంతో 4 –2 పాయింట్ల తేడాతో ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను అర్జెంటీనా  జట్టు తన ఖాతాలో వేసుకుంది. 

అయితే ఈ మ్యాచ్ లో అర్జెంటీనా టీమ్ కోసం మొదటి గోల్, మూడో గోల్ చేసింది మెస్సీనే.