మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం కోటలో పోలీసులు పరేడ్ రిహార్సల్ నిర్వహించారు. అడిషనల్ డీజీ స్వాతి లక్రా, ఐపీఎస్ సుదీక్ష రెడ్డి పరేడ్‌ను పర్యవేక్షించారు. రిహార్సల్స్‌లో భాగంగా ఆదివారం ఉదయం సీఎం కాన్వాయ్ గోల్కొండ కోటకు చేరుకుంది. మిగతా ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

