ఇండియాకు చేరిన అయిదో విడత రాఫెల్ జెట్లు

ఇండియాకు చేరిన అయిదో విడత రాఫెల్ జెట్లు

రాఫెల్ జెట్ల కొనుగోలుకు సంబంధించి భారత్ 2016లో రూ. 58 వేల కోట్ల విలువైన ఒప్పందం ఫ్రాన్స్‌తో చేసుకుంది. అందులో భాగంగా.. గురువారం భారత్‌కు మరో నాలుగు ఫైటర్ జెట్లు చేరుకున్నాయి. దీంతో ఐదు విడతలుగా ఇప్పటివరకు ఇండియాకు 18 ఫైటర్ జెట్లు చేరుకున్నాయి. ఈ 18 ఫైటర్ జెట్లు అంబాలాలో ఏర్పాటు చేసిన మొదటి రాఫెల్ స్క్వాడ్రన్ నుంచి పనిచేయనున్నాయి. మిగతా 18 ఫైటర్ జెట్లు పశ్చిమ బెంగాల్‌లోని హసీమారాలో ఏర్పాటు చేసిన సెకండ్ స్క్వాడ్రన్‌కు ఈ ఏడాది చివరిలోగా చేరుకోనున్నాయి.

ఐదు రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బదౌరియా.. రాఫెల్ యుద్ధ విమానాలను ప్రారంభించారు. గడువులోపే రఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు పంపినందుకు ఫ్రాన్స్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫ్రాన్స్, యూఎఈ ఎయిర్ ఫోర్స్‌ల సహాయంతో ఎయిర్ టూ ఎయిర్ రీఫిల్లింగ్ చేసుకుంటూ దాదాపు8 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకొని ఫైటర్ జెట్లు భారత్‌కు చేరాయి.