కరోనా సంక్షోభంలోనూ కంపెనీలు కొలువులిస్తయట

కరోనా సంక్షోభంలోనూ కంపెనీలు కొలువులిస్తయట


న్యూఢిల్లీ: దేశంలో హైరింగ్ యాక్టివిటీ పెరుగుతుందనే అంచనాలున్నాయి. కిందటేడాదితో పోలిస్తే  ఈ ఏడాది ఎక్కువ మందిని నియమించుకోవాలని కంపెనీలు చూస్తున్నాయి. సుమారు 58 శాతం కంపెనీలు 2020 తో పోలిస్తే ఎక్కువ మందిని నియమించుకోవాలని ప్లాన్స్ వేస్తున్నాయని మెర్సెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్ల్‌‌‌‌‌‌‌‌ ఓ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ది స్టేట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ టాలెంట్‌‌‌‌‌‌‌‌ అక్వైజేషన్‌‌‌‌‌‌‌‌ 2021 పేరుతో ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసింది. మొత్తం 500 కంపెనీలకు చెందిన హెచ్‌‌ఆర్‌‌‌‌ హెడ్‌‌లు, ఎగ్జిక్యూటివ్‌‌ల నుంచి కంపెనీ అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో ఎడ్యుకేషనల్‌‌, హెల్త్‌‌, ఐటీ, ఎలక్ట్రికల్‌‌ వంటి వివిధ సెక్టార్లకు చెందిన కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సర్వే ప్రకారం..  22.12 శాతం కంపెనీలు కిందటేడాదితో  పోలిస్తే హైరింగ్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెంచాలనుకోవడం లేదు.  16.35 శాతం కంపెనీలు కిందటేడాదితో పోలిస్తే తక్కువ మందిని నియమించుకుంటాయని, 3.85 శాతం కంపెనీలు నియామకాలను చేపట్టడానికి ఇష్టపడడం లేదని ఈ రిపోర్ట్‌‌  పేర్కొంది.  కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ  హైరింగ్ మేనేజర్లు పాజిటివ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నారని అంచనావేసింది. కిందటేడాదితో పోలిస్తే  తమ హైరింగ్ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 30 శాతం వరకు పెంచాలని 44 శాతం కంపెనీలు చూస్తున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కంపెనీల హైరింగ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉంటుందని, డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్‌‌‌‌‌‌‌‌ ఆఫర్స్‌‌‌‌‌‌‌‌ అమల్లోకి వస్తాయని మెర్సెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెట్ల్‌‌‌‌‌‌‌‌ సీఈఓ సిద్ధార్ద్‌‌‌‌‌‌‌‌ గుప్తా అన్నారు. 

వర్చువల్‌‌‌‌‌‌‌‌గా హైరింగ్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌..

ప్రొడక్ట్‌‌‌‌‌‌‌‌, టెక్నాలజీ రోల్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. 53 శాతం కంపెనీలు ఈ జాబ్ రోల్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నాయి. వీటి తర్వాత ఆపరేషన్స్‌‌, సేల్స్‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌, బిజినెస్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌, హ్యుమన్ రిసోర్స్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉంది. కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ  కంపెనీలు తమ హైరింగ్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ను కొనసాగించాలని చూస్తున్నాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. వర్క్‌‌‌‌‌‌‌‌ ఫ్రమ్‌‌‌‌‌‌‌‌ హోమ్‌‌‌‌‌‌‌‌ విధానం పెరగడంతో హైరింగ్‌‌‌‌‌‌‌‌ను ఆపాల్సిన అవసరం లేదని భావిస్తున్నాయని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం  చాలా కంపెనీలు హైరింగ్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లో టెక్నాలజీని వాడడాన్ని పెంచాయి. ఇంకా చెప్పాలంటే  76 శాతం కంపెనీలు తమ బిజినెస్‌‌‌‌‌‌‌‌ పెరగడానికి టెక్నాలజీ ముఖ్యమని భావిస్తున్నాయి. ఇండియన్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు టెక్నాలజీకి వేగంగా షిప్ట్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి. వర్చువల్‌‌ హైరింగ్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ పెరుగుతోంది.  80 శాతం రెస్పాండెంట్లు వర్చువల్‌‌ హైరింగ్‌‌కు మొగ్గుచూపాయని ఈ రిపోర్ట్ పేర్కొంది.  సర్వేలో పాల్గొన్న కంపెనీలలో 53 శాతం కంపెనీలు వర్చువల్ హైరింగ్ పెంచి, తమ ఇతర రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌లను తగ్గించాయి. 50 శాతం కంపెనీలు తమ హైరింగ్ ఖర్చులను తగ్గించుకుంటున్నాయి.

కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే!

లార్జ్‌‌‌‌‌‌‌‌ సైజ్ కంపెనీలు (28%) టెక్నాలజీ ఆధారంగా హైరింగ్‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ను చేపట్టడంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మీడియం సైజ్‌‌‌‌‌‌‌‌, స్మాల్ సైజ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు మాత్రం జాబ్ రోల్స్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్టు టాలెంట్‌‌‌‌‌‌‌‌ ఉన్న వారిని నియమించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాయి. సర్వేలో పాల్గొన్న కంపెనీలలో 54.26 % కంపెనీలు కమ్యూనికేషన్ స్కిల్స్‌‌‌‌‌‌‌‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామన్నాయి. 44.68 % కంపెనీలు టెక్నికల్ స్కిల్స్‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పాయి. 

3 నెలల్లో వెయ్యి మందిని నియమించుకుంటాం

రానున్న మూడు నెలల్లో వెయ్యి మంది ఉద్యోగులను నియమించుకుంటామని ఎడ్యుటెక్ కంపెనీ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌ను అందుకోవడానికి  ఈ నియామకాలను చేపడతామని తెలిపింది. లెర్నింగ్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌, డెలివరీ, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌, ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌, సేల్స్‌‌‌‌‌‌‌‌ వంటి వివిధ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లలో ఈ హైరింగ్ ఉంటుందని కంపెనీ ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ రెక్రుట్‌‌‌‌‌‌‌‌ హైరింగ్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఈ నియామకాలను చేపడతామని కంపెనీ తెలిపింది.  గత 18 నెలల నుంచి వేగంగా వృద్ధి చెందుతున్నామని,  అందుకే ఈ హైరింగ్ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ను చేపడుతున్నామని అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ సీఈఓ ఇండియా అర్జున్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌ అన్నారు.