
చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీస్ ముందు టీఆర్ఎస్, సీపీఎం, కాంగ్రెస్ కార్యకర్తలు తన్నుకున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో కార్యకర్తలు ఫైటింగ్ చేసుకున్నారు. కౌన్సిలర్లపై కార్యకర్తలు దాడి చేశారు. దీంతో… అక్కడ పరిస్థితి టెన్షన్ గా మారింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా.. పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తల గొడవతో చౌటుప్పల్ లో ఉద్రిక్తంగా మారింది.