కేంద్రం కలిసొస్తే కరోనాను తరిమికొడతాం

కేంద్రం కలిసొస్తే కరోనాను తరిమికొడతాం

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ల గోల్ మాల్ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇది కాస్తా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య చిచ్చు రేపింది. సుప్రీం కోర్టు నియమించిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ రిపోర్టులో ఉన్న విషయాలపై బీజేపీ అబద్ధాలు చెబుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఫైర్ అయ్యారు. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. ప్రజలకు ఆక్సిజన్ అందేందుకు పోరాడటమే తమ తప్పని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికైనా కేంద్రం తమతో కలసి పని చేయాలని, తద్వారా థర్డ్ వేవ్‌లో ఆక్సిజన్ షార్టేజీ లేకుండా చూడాలని హితవు పలికారు. 

‘ఆక్సిజన్‌పై మీ (బీజేపీ) పోరాటం ముగిస్తే మనం ఎవరి పనుల్లో వారు బిజీ అవ్వొచ్చు. కేంద్రం మాతో కలసి పని చేస్తే థర్డ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత రాకుండా చూసుకోవచ్చు. సెకండ్ వేవ్‌ వచ్చినప్పుడు ఆక్సిజన్ షార్టేజీ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి థర్డ్ వేవ్‌లో ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలి. మనతో మనం పోరాడితే కరోనా గెలుస్తది. అదే మనం ఒకరితో మరొకరం కలసి వైరస్‌పై పోరాడితే దేశం గెలుస్తది’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.