డొక్కా సీతమ్మ టైటిల్ హక్కులపై రగడ

డొక్కా సీతమ్మ టైటిల్ హక్కులపై రగడ

డొక్కా సీతమ్మ బయోపిక్‌‌ అంటూ ఇప్పటికే కొందరు మూవీ మేకర్స్ సినిమాను స్టార్ట్ చేశారు. అయితే ఆ టైటిల్ విషయంలో వివాదం జరుగుతోంది. ‘అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’  బయోపిక్ టైటిల్‌‌తో వీఎన్ఆర్ ఫిలింస్ సంస్థ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. 

ఈ చిత్రానికి ఎ.ఆర్.బి. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అచ్చర్త రాజుబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు  ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’  టైటిల్‌‌తో ఊషారాణి మూవీస్ బ్యానర్‌‌‌‌లో వల్లూరి రాంబాబు నిర్మాతగా, రవి నారాయణ్ దర్శకుడిగా మరో  సినిమా రూపొందిస్తున్నారు. 

అయితే ‘అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ టైటిల్‌‌ను తాము ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ చేయించామని, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ సినిమాను రూపొందించడం కరెక్ట్ కాదని వీఎన్ఆర్ ఫిలింస్ వెల్లడించింది. ఈ టైటిల్ హక్కులు తమకే సొంతమని  ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’ చిత్ర  నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.