
సరిహద్దు గస్తీ, దేశ రక్షణలో భాగంగా శత్రు స్థావరాలపై స్ట్రాటజికల్ గా దాడులు చేసే వాయుసైన్యం వ్యూహాత్మక దళాలకు కొత్త అధిపతి వచ్చారు.
ఫైటర్ పైలట్ ఎయిర్ మార్షల్ నవ్ కరణ్ జిత్ సింగ్ ధిల్లాన్ ను స్ట్రాటజికల్ ఫోర్సెస్ కమాండ్ చీఫ్ గా అపాయింట్ చేశారు.
1981 లో ఆయన ఎయిర్ కమిషన్ లో చేరారు. స్క్వాడ్రాన్ లీడర్, గ్రూప్ కెప్టెన్, ఎయిర్ కమాండర్, ఎయిర్ వైస్ మార్షల్ గా పదవులు దక్కించుకున్న NS ధిల్లాన్…. 2016లో ఎయిర్ మార్షల్ అయ్యారు.
దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన ‘వ్యూహాత్మక అణు ఆయుధగారం’ ఈ దళాల ఆధీనంలోనే ఉంటుంది. ఈ ఆయుధశాలను సంరక్షించే బాధ్యతను ఫైటర్ పైటల్ ఎయిర్ మార్షల్ ఎన్ఎస్ ధిల్లాన్ తీసుకున్నారు.