
- నల్గొండ టీడీపీ మీటింగ్ లో నాయకుల కొట్లాట
నీలగిరి, వెలుగు: నల్గొండ టీడీపీ ఆఫీస్‌లో శుక్రవారం ఆ పార్టీ పార్లమెంటరీ స్థాయి సమావేశం రసాభాసగా ముగిసింది. హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కిరణ్మయి ఎన్నికల సమయంలో బీజేపీకి సహకరించిందని, పార్టీ నాయకులను దూరంగా ఉంచిందని కొందరు ఆరోపించారు. దీంతో గొడవ మొదలై నాయకులు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. సమావేశానికి పరిశీలకులుగా వచ్చిన సామ భూపాల్‌రెడ్డి, మోపతయ్య సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరును తోసుకుంటూ, కొట్టుకున్నారు. చివరికి కొందరు సీనియర్ నాయకులు రెండు వర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ ఆగిపోయింది.