క్యాన్సర్ నుంచి బ్లడ్ షుగర్ వరకు.. కాకరకాయతో ఎన్నో లాభాలు

క్యాన్సర్ నుంచి బ్లడ్ షుగర్ వరకు.. కాకరకాయతో ఎన్నో లాభాలు

కాకరకాయలను శాస్త్రీయంగా మోమోర్డికా చరాంటియా అని పిలుస్తారు. ఇది గుమ్మడికాయ, దోసకాయ లాంటి తీగ రకానికి చెందింది. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

చేదు కాకరకాయలో విటమిన్ సి అనే ముఖ్యమైన కంటెంట్ ఉంది. ఇది వ్యాధి నివారణ, ఎముకల నిర్మాణం, గాయం నయం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ ఎ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇది చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో, దృష్టిని మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వీటితో పాటు, పొటాషియం, జింక్, ఐరన్ లాంటి ఖనిజాలు పెరుగుదలకు అవసరమైన ఫోలేట్‌ను అందిస్తుంది.

బ్లడ్ షుగర్ తగ్గుతుంది

కాకరకాయలో శక్తివంతమైన ఔషధ లక్షణాల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న వ్యాధుల్లో ఒకటైన మధుమేహం, దాని సంబంధిత వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఇటీవల ఓ పరిశోధన రుజువు చేసింది.  

క్యాన్సర్‌తో పోరాడుతుంది

ఇది బిట్టర్ మెలోన్ క్యాన్సర్‌ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, కడుపు, పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, నాసోఫారెక్స్ (గొంతు ప్రాంతంలో ముక్కు వెనుక భాగంలో)లోని క్యాన్సర్ కణాలను తొలగించడంలో కాకరకాయ సారం ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనం నిరూపించింది.

Also Read :- ట్రెండీ హెయిర్ పిన్స్.. స్టయిల్ గా.. ఫ్యాషన్ గా

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది

కాకరకాయ... బరువు తగ్గేందుకు సైతం ఉపయోగపడుతుంది. ఇందులో అధిక ఫైబర్‌, తక్కువ కేలరీల కంటెంట్‌ ఉంటుంది, ప్రతి 100-గ్రాముల్లో సుమారు 2 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆకలిని సమర్థవంతంగా అరికడుతుంది, ఆకలిని తగ్గిస్తుంది.

కాకరకాయకున్న విలక్షణమైన ప్రయోజనాల వల్ల వీటిని రోజూ వారి ఆహారంలో తీసుకోవడం అత్యంత ఆవశ్యకం. వీటిని పచ్చిగా లేదా ఇతర వంటకాల్లోనూ ఉపయోగించవచ్చు.