Olympic Qualifiers 2024: అమెరికా చేతిలో ఇండియా ఓటమి

Olympic Qualifiers 2024: అమెరికా చేతిలో ఇండియా ఓటమి

రాంచీ: ఎఫ్‌‌‌‌ఐహెచ్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫయర్స్‌‌‌‌ టోర్నీలో ఇండియా విమెన్స్‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌కు చుక్కెదురైంది. శనివారం జరిగిన పూల్‌‌‌‌–బి తొలి మ్యాచ్‌‌‌‌లో ఇండియా 0–1తో అమెరికా చేతిలో ఓడింది. టామర్‌‌‌‌ అబిగైల్‌‌‌‌ (16వ ని.) యూఎస్‌‌‌‌కు ఏకైక గోల్‌‌‌‌ అందించింది. 

ఆట మొత్తంలో ఏడు పెనాల్టీ కార్నర్లను సాధించిన ఇండియా ఒక్కదాన్నీ సద్వినియోగం చేసుకోలేదు. బలమైన డిఫెన్స్‌‌‌‌తో ఇండియా ఎదురుదాడులకు అడ్డుకట్ట వేసిన అమెరికా రెండో క్వార్టర్‌‌‌‌లో ఫీల్డ్‌‌‌‌ గోల్​తో షాకిచ్చింది. దీని నుంచి తేరుకునేలోగా వరుస దాడులతో ఇండియాను బెంబేలెత్తించింది. ఏడు నిమిషాల వ్యవధిలో మూడు పెనాల్టీలను సాధించింది. అయితే వీటిని గట్టిగా తిప్పికొట్టి ఇండియా ఊపిరి పీల్చుకుంది. తాజా ఓటమితో ఇండియా ఒలింపిక్‌‌‌‌ క్వాలిఫయింగ్‌‌‌‌ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగే మ్యాచ్‌‌‌‌లో ఇండియా.. న్యూజిలాండ్‌‌‌‌తో తలపడుతుంది.