పొరపాటున డీజిల్ కారులో పెట్రోల్ నింపితే?..ఇంజిన్కు డ్యామేజే..అలా కాకుండా ఉండాలంటే

పొరపాటున డీజిల్ కారులో పెట్రోల్ నింపితే?..ఇంజిన్కు డ్యామేజే..అలా కాకుండా ఉండాలంటే

ప్రస్తుతం మన దేశంలో పెట్రోల్, డీజిల్, సీఎన్ జీ , ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తున్నాయి. పెట్రోల్ పంపుల వద్ద డిజిల్ వాహనాలకు పెట్రోలో.. పెట్రోల్ వాహనాలకు డీజిల్ పొరపాటున ఫిల్ చేసే సంఘటనలు జరుగుతుంటాయి. ఇలా చేస్తే.. కారు ఇంజిన్ ఏమైనా నష్టం ఉందా? అంటే ఉంది..డీజిల్ కారులో పెట్రోల్ నింపడం వల్ల ఇంజిన్ కు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. అదే పెట్రోల్ కారులో డీజిల్ పెట్టడం వల్ల డీజిల్ అంత నష్టం ఉండదు.. కానీ నష్టమే.. వివరాలేంటో తెలుసుకుందాం.. 

డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే ఎక్కువ నష్టం ఎందుకు జరుగుతుందో ముందుగా తెలుసుకుందాం. డీజిల్ లూబ్రికేషన్ ఆయిల్ గా పనిచేస్తుంది. దీంతో ఇంధన పంపు , ఇంజిన్ కు సంబంధించిన ఇతర భాగాలు సరిగ్గా పనిచేస్తాయి. డీజిల్ ట్యాంకులో పెట్రోల్ నింపినట్లయితే మీ కారును స్టార్ట్ చేసిన వెంటనే అది ఇంజిన్ లోని ప్రతి భాగానికి చేరుతుంది. డీజిల్ తో కలిపినప్పుడు పెట్రోల్ ద్రావకం వల్లె పనిచేస్తుంది. ఇది కారు భాగాల మధ్య ఘర్షణను పెంచుతుంది. ఇంధన లైన్ తో పాటు పంపు దెబ్బతినొచ్చు. ఇంజిన్ కు  కూడా భారీ నష్టం జరగొచ్చు. 

ఒకవేళ ఈ విషయం తెలిసి వుంటే మీరు కారుని స్టార్ట్ చేయొద్దు.. కారును స్టార్ట్ చేస్తే డీజిల్  కలిపిన పెట్రోల్ ఇంజిన్ కు వెంటనే చేరుతుంది. ఇలా జరగడం చాలా ప్రమాదకరం.. కారు భాగాలుపాడైపోతాయి. కారు స్టార్ట్  చేయకపోతే ఆయిల్ ట్యాంక్ లోనే ఉంటుంది. ఆయిల్ ట్యాంక్ నుంచి పెట్రోల్, లేదా డీజిల్ ను తొలగించాలి.

ALSO READ :- Ajith Health Update: అజిత్ సర్జరీ అవాస్తవం..ఆ సమస్య వల్లే హాస్పిటల్లో చేరాడు: మేనేజర్ సురేష్ చంద్ర

తప్పనిసరిగా చేయాల్సిన పని ఏంటంటే వాహనం కొన్ని సెకన్లు లేదా కొన్ని అడుగుల దూరం నడిపినా వేలల్లో నష్టం రావొచ్చు. అందుకే కారుని స్విచ్ ఆఫ్ చేసి మెకానిక్ ను చూపించాలి.  సో.. టేక్ కేర్ ఎబౌట్ యువర్ వెహికల్..