విచారణకు హేమ డుమ్మా..వైరల్ ఫీవర్​తో బాధపడుతున్నట్టు లెటర్

విచారణకు హేమ డుమ్మా..వైరల్ ఫీవర్​తో బాధపడుతున్నట్టు లెటర్
  • మళ్లీ నోటీసు ఇవ్వనున్న బెంగళూరు సీసీబీ పోలీసులు

హైదరాబాద్‌‌, వెలుగు : బెంగళూర్‌‌‌‌ రేవ్‌‌ పార్టీ డ్రగ్స్‌‌ కేసులో సినీ నటి హేమ.. పోలీస్ విచారణకు డుమ్మా కొట్టింది. వైరల్‌‌ ఫీవర్ కారణంగా ఎంక్వైరీకి హాజరుకాలేనని బెంగళూరు సీసీబీ పోలీసులకు ఆమె లెటర్ రాసింది. హేమ రాసిన లెటర్‌‌‌‌ను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఈ మేరకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 19న రాత్రి బెంగళూర్‌‌‌‌ ఎలక్ట్రానిక్స్​ సిటీ సమీపంలోని జీఆర్‌‌‌‌ ఫామ్‌‌హౌస్‌‌లో రేవ్‌‌ పార్టీ జరిగిన సంగతి తెలిసిందే. 

ఈ పార్టీలో లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రగ్స్, గంజాయితో పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూసెన్స్ చేస్తున్నారనే సమాచారంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడులు చేశారు. 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో నటి హేమ కూడా ఉంది. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆమెకు పోలీసులు నోటీసులిచ్చారు.

తన హెల్త్ బాగాలేదని, ఎంక్వైరీకి అటెండ్ కాలేనంటూ ఆమె లేఖ రాసింది. దీంతో బెంగళూరు పోలీసులు హేమ తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. విచారణకు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించినట్టు తెలిసింది.